

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు మరియు ఏ. శ్రీనివాసులు ఇరువురికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గౌదగట్లపాలెం ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ సుబ్బారావు గారు తన 40 ఏళ్ల సర్వీసులో సతీమణి మల్లీశ్వరి సహకారంతో అత్యుత్తమ సేవలు అందించారని, పాఠశాలను అభివృద్ధి చేయడమే కాకుండా పిల్లల సంఖ్యను పెంచే దానికి కృషి చేశారని, ఉపాధ్యాయ సమస్యలపై అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు అని తెలియజేశారు. స్థానిక ఉపాధ్యాయుడు కొల్లూరు వెంకయ్య మాట్లాడుతూ బాలయోగి నగర్ మోడల్ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పదవీ విరమణ అనంతరం కూడా విద్యారంగంలో వారి యొక్క సేవలు అందించాలని ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిడితోటి నరేంద్ర కుమార్, పూర్ణచంద్రరావు, సుధాకర్ రెడ్డి, చైర్మన్ రమేష్, తరుణ్ సాయి సుబ్బారావు గారి కుమారులు సందీప్, ప్రదీప్ కోడళ్ళు దివ్య, నిఖిల మనవరాలు శాన్విక్, కనీష, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.