33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

మనన్యూస్నిజాంసాగర్( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో మొక్క,గుండూరు నుండి మహారాష్ట్ర బాడర్ వరకు పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత పరిపాలకుల నిర్లక్ష్యంతో కనీసం గ్రామాలల్లో రోడ్లు వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు..
ఎన్నికల ముందు గ్రామాలల్లో పర్యటించినప్పుడే తాను ఎమ్మెల్యేగా గెలిచాక ముందుగా రోడ్లు వేయించాలని ధృడంగా నిశ్చయించుకున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని,వారి సహకారంతో జుక్కల్ నియోజకవర్గంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
నియోజకవర్గంలో సీ.సీ రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు మొత్తం 33 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు.
అదేవిధంగా ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు వేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు..
గత పాలకులు చేయలేని అసాధ్యమైన పనులు కూడా చేపడుతున్నామని అన్నారు..
అసమర్థ నాయకుల వల్ల ఆగిపోయిన లెండి,నత్తనడకన సాగుతున్న నాగమడుగు ప్రాజెక్టుల పనులు నేడు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు..
నియోజకవర్గంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని,ఇక ముందు కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు..
అయితే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు..
రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా సన్నాలకు క్వింటాలుకు 500 బోనస్ ఇచ్చి అన్నదాతకు అండగా నిలిచాడన్నారు..
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ దుకాణాల్లో ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని, పేదలందరూ మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు.కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///