భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

గూడూరు, మన న్యూస్ :- మైనింగ్ కబంధ హస్తాల్లో నీ బంజరు మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ తో అడవిలా గా వున్న బంజరు భూమి లో దిగి చెట్టు పుట్ట తొలగించుకొని నిరుపేదలు సాగు చేసుకోవాలని దిగితే సంబంధం లేని వెంకట క్రిష్ణ మైనింగ్ తో పోలీస్ ద్వారా 50 మంది దళితులు పైఅక్రమ కేసు బనాయించడం దారుణమనిఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య ఆరోపించారు. ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా సదస్సు విజయవంతం చేయాలని పిలుపులో బాగంగా ఆదివారం గూడూరు లోని రిటైర్డ్ అధికారుల భవనం లో డిపి పోలయ్య మీడియా తో మాట్లాడుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యవర్గం ఆద్వర్యం లో ఈ నెల 30 వ తేదీన ఉమ్మడి జిల్లా భూ సదస్సు ను ఈ రిటైర్డ్ ఉద్యోగుల భవనం లో నిర్వహించ బోతున్నామ న్నారు.సైదాపురంమండలం లోని ఊటుకూరు గ్రామ సర్వే నంబర్356,359 లో 400 ఎకరాలలో ప్రభుత్వ భూములుఉన్నాయన్నారు.సర్వే నంబర్ 356 లో 215.65 ఎకరాలు మేత పోరంబోకు భూములను ఆగ్రామం లోని భూస్వాములు పెత్తందారులు అక్రమంగా ఆక్రమణ చేసి ఒక్కోక్కరు 5 నుండి 10 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారన్నారు.భూ స్వాముల ఆక్రమణ లోని భూముల పట్ల రెవిన్యూ యంత్రాంగం కళ్ళు న కబోధిలా వ్యవ హరిస్తుందన్నారు.359 P 2 లో నీ 50 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలు ఆక్రమించుకుని చెట్టు పుట్ట తొలగిస్తే మాత్రం రెవిన్యూ అధికారులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.గ్రామ పెత్తందారులుఆక్రమించుకున్న భూముల్లో ఎటువంటి నిషేధ బోర్డు లు పెట్ట కుండా కేవలం దళితులు పేదలు సాగు చేసుకుంటున్న ఆ భూముల్లో సైదాపురం మండలం తహశీల్దారు నిషేధ బోర్డు లు పెట్టడమంటే భూస్వాములు తో రెవిన్యూ యంత్రాంగం ఏవిధంగా కుమ్మకైందొ అర్థమైందన్నారు. మార్చి 29న సైదాపురం పోలీస్ స్టేషన్ లో 14 మంది పై మరి కొందరి పై అక్రమ కేసులను పెట్టారన్నారు.కొంతమంది మైనింగ్ యాజమాన్యాలతో రెవిన్యూ యంత్రాంగం పోలీస్ లు కుమ్మకై దళితులు పేదలపై అక్రమ కేసులను పెట్టీ భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా పేదలకు ప్రభుత్వ భూముల ను దక్క కుండా చేస్తున్నారన్నారు.పేదలు సాగు చేసుకుంటున్న 50 ఎకరాల భూములకు హక్కులు కల్పించాలని సైదాపురం మండలం తహశీల్దారు నెల్లూరు ఆర్ డి ఓ జిల్లా కలెక్టర్ కు మొర పెట్టుకున్నా అరణ్య రోదన గా మిగిలిపోయిందన్నారు.ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు వందల వేల ఎకరాలుఅప్పనంగాకట్టబెడుతున్నాయన్నారు.పారిశ్రామిక వాడలు సెజ్ లు హైవేలు పేరు తో వ్యవసాయ భూములను సముద్ర తీర ప్రాంతాలను కార్పొరేట్ల పరం చేస్తున్నారన్నారు. అసైన్మెంట్ చట్టం అనేక సవరణలకు గురైందన్నారు. అసైన్మెంట్ చట్టం అమలులో ఉన్నప్పుడే సుమారు 25 లక్షలకు పైగా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయినట్లు కోనేరు రంగారావు కమిషన్ తేల్చిందన్నారు.అన్యాక్రాంతం అయిన అసైన్మెంట్ భూములను లబ్ధిదారులకు దళితులకు పేదలకు ప్రభుత్వంస్వాధీనంచేయాలనీ డిమాండ్ చేశారు.కేంద్రం లో మోదీ 3.0 ప్రభుత్వం బడా కార్పోరేట్ కంపెనీలకు అదానీ అంబానీలకు దాసోహం అయిందన్నారు.నూటికి 70 శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగా న్నీ సైతం కార్పోరేట్ శక్తులకు కట్ట బెట్టడానికిపూనుకుందన్నారు.నూతన వ్యవసాయ విధానం ఆ కోవలో నీదేనన్నారు. అఖిల భారత రైతు కూలిసంఘం నాయకత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో జరిగిన జరుగుతున్న పోరాటాలు సంబంధించి అలాగే భూమి కోసం భుక్తి కోసం అనే విధంగా ఈ నెల 30 న గూడూరు లోని రిటైర్డ్ అధికారుల భవనం లో ఉమ్మడి నెల్లూరు జిల్లా సదస్సు ను నిర్వహిస్తున్నట్లు ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు డి పి పోలయ్య తెలిపారు. ఈ జిల్లా సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు కూలీలు మహిళలు ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ జిల్లా సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు తమ ఆర్ధిక హార్దిక సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఐ ఎఫ్ టి యు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రమేష్, పి ఓ డబ్ల్యూ మహిళా నాయకురాలు బి మమత తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///