ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి 100 సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేదు – ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నందు మాట్లాడుతూ…. (శనివారం ) గద్వాల నియోజకవర్గంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర మత్స్యకార , యువజన శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా ఓ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టులో కూలిపోతాది. ఎక్కువ వాహనాలు తిరగడం వల్ల ప్రాజెక్టు కూలిపోతుందని ప్రజలకు భయాందోళన కల్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆది సరైన పద్ధతి కాదు. జూరాల ప్రాజెక్టులో కొంత సమస్యలు ఉన్న మాట వాస్తవమే కానీ ప్రాజెక్టు కూలిపోయేంత పరిస్థితి (కాదు)లేదు. సమస్య లేకపోయినా కూడా ప్రజలకు తప్పుడు మాటలు చెప్పి ప్రజలకు భయాందోళన కల్పించడం సరైన పద్ధతి కాదని సూచించారు.
ఏ ప్రభుత్వాలు వచ్చిన ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేయాలా ప్రాజెక్టుల్లో పూర్వ వైభోగం తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది కానీ ప్రాజెక్టులను నాశనం చేయాలని ప్రాజెక్టులను రిజర్వాయర్లను పోతేపోనీ అని ఎవరు కూడా అనుకోరు. గత ప్రభుత్వంలో కూడా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ప్రాజెక్టులో ఉన్న చిన్నచిన్న సమస్యలను మరమ్మతులను పరిష్కరించే విధంగా మరియు ప్రాజెక్టులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది తెలిపారు.
ప్రాజెక్టు లోపలికి వెళ్లడానికి కూడా పరిస్థితి బాగాలేదని మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఈ ఫోటోల ద్వారా చూడండి ప్రాజెక్టు లోపల అధికారులు లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు. మీరు (జర్నలిస్టు) కూడా మాతో పాటు వస్తే ప్రాజెక్టు లోపలికికెళ్లి చూడవచ్చు. విలేకరులు రేపు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి లోపల ఎలాంటి సమస్యలు లేవని ప్రజలకు నిజనిజాలు చూపించే విధంగా మీడియా ద్వారా ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, రేపు (సోమవారం ) మీరు ( జర్నలిస్టు) ప్రాజెక్టు దగ్గరికి రండి మేము తీసుకువెళ్లి వాస్తవాలను చూపిస్తాము. అందువల్ల ఎవరైన ప్రజలను తప్పుదోవ పట్టించకుండా నిజనిజాలు తెలుసుకొని మాట్లాడాలని కోరారు. గద్వాల నియోజకవర్గంలో నేను ఏ పార్టీ అని విమర్శిస్తున్నారు . వారికి నేను సూటిగా సమాధానం చెప్తున్నాను నేను అభివృద్ధి పార్టీ గద్వాల అభివృద్ధి కోసమే అధికార పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. గద్వాల నియోజకవర్గంలోని ప్రజలు ,రైతాంగం, వ్యాపారస్తులు అభివృద్ధి చెందాలని గద్వాల నియోజకవర్గం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గల కన్నా ముందు ఉండాలని సదుద్దేశంతో అధికార పార్టీలో భాగస్వాములై మద్దతు తెలపడం జరిగిందని అని పేర్కొన్నారు.
గతంలో గట్టు మండలం ఆసియా ఖండంలోనే అక్షరాస్యతలో వెనుకబడినది కానీ ప్రస్తుతం గట్టు మండలం 62 శాతం పెరగడం జరిగినది. అదేవిధంగా గద్వాల పట్టణంలో, ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం డ్రైనేజీ నిర్మాణం అదేవిధంగా అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం గద్వాల పట్టణంలో కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగినది కొన్ని చిన్నచిన్న సమస్యల వల్ల కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి ఆలస్యం అవుతున్నాయి వాటిని కూడా వెంటనే పరిష్కరించి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నా చివరి శ్వాస వరకు గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు జి.వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ శ్రీను ముదిరాజ్, నాయకులు గోవిందు, కురుమన్న ధర్మ నాయుడు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..