ఘనంగా “ఝాన్సీ ఐపీఎస్” ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్.

Mans Cinema:- ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం ఈనెల 29న తెలుగులో గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు నిర్మాత ఆర్.కె. గౌడ్. తాజాగా “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా*నిర్మాత ఎ గురురాజ్ మాట్లాడుతూ* – “ఝాన్సీ ఐపీఎస్” సినిమా కంటెంట్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ యాక్షన్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మంచి ఆదరణ పొంది నిర్మాతగా రామకృష్ణ గౌడ్ గారికి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు.*చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ*… కర్తవ్యం వంటి లేడీ ఓరియెంటెడ్ పోలీస్ స్టోరీతో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాత ఏఎం రత్నం గారు ఈ రోజు మా “ఝాన్సీ ఐపీఎస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎన్నో ఘన విజయాలు సాధించాయి. అలాంటి ప్రయత్నమే మా సంస్థ ద్వారా “ఝాన్సీ ఐపీఎస్”తో చేస్తున్నాం. ఈ చిత్రంలో లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం చేశారు. భూ కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టిన వారి భవనాలు కూల్చే ఐపీఎస్ ఆఫీసర్ గా లక్ష్మీరాయ్ కనిపిస్తారు. ఆమె పాత్ర చూస్తే ఇప్పటి హైడ్రా గుర్తుకు వస్తుంది. అలాగే గ్లామరస్ గా ఉండే మరో క్యారెక్టర్ తో పాటు డ్రగ్స్ ముఠాను వేటాడే పాత్రలో ఆమె నటించారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు 8 ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమా తర్వాత మహిళా కబడ్డీ జట్టు అనే మూవీ చేస్తున్నాం. ఢీ విన్నర్ అక్సా ఖాన్ ఆ సినిమాలో నటిస్తారు. ఈ నెల 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు మా మూవీని తీసుకొస్తున్నాం. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నా అన్నారు.*టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్ మాట్లాడుతూ* – “ఝాన్సీ ఐపీఎస్” సినిమా తమిళం, మలయాళంలో ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోకి రామకృష్ణ గౌడ్ గారు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే యాక్షన్ తో పాటు మంచి గ్లామర్ ఉంటుందని తెలుస్తోంది. “ఝాన్సీ ఐపీఎస్” సినిమా తప్పకుండా విజయవంతం కావాలి, మీరంతా థియేటర్స్ లో ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నా అన్నారు.*నటి అక్సాఖాన్ మాట్లాడుతూ* – “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ట్రైలర్ కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను డ్యాన్సర్, జిమ్నాస్ట్ ను. నేను కోరుకునే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఈ నెల 29న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడండి. తమిళం, మలయాళం కంటే తెలుగులో “ఝాన్సీ ఐపీఎస్” పెద్ద సక్సెస్ కావాలి అన్నారు.*నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ* – సినిమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి. నా కర్తవ్యం మూవీ చూసి చాలామంది అమ్మాయిలు పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు. అలాగే భారతీయుడు మూవీ చూసి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారు. బాయ్స్ సినిమా చూసి ఇంట్లోంచి బయటకు వచ్చి సినిమాల కోసం ప్రయత్నించానని కేజీఎఫ్ హీరో యష్ నాతో చెప్పారు. అలా సినిమా మాధ్యమం ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తుంది. “ఝాన్సీ ఐపీఎస్” ట్రైలర్ చూశాను చాలా బాగుంది. లక్ష్మీరాయ్ యాక్షన్ బాగా చేయగలదు. ఈ సినిమాతో రామకృష్ణ గౌడ్ గారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా అన్నారు.*నటుడు సుమన్ మాట్లాడుతూ* – రత్నం గారు ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. అప్పట్లో మేము చేసిన మూవీస్ చూసి యూత్ ఇన్స్ పైర్ అయ్యేవాళ్లు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాళ్లు. ఇప్పుడు మహిళలు మరింతగా పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి రావాల్సిన అవసరం ఉంది. “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ఆ స్ఫూర్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే రామకృష్ణ గౌడ్ గారికి ఈ సినిమా మంచి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో స్నిగ్ధా రెడ్డి, మౌనిక రెడ్డి, రవి, అల్లభక్షు, డి ఏస్ రెడ్డి, దుబాయ్ ప్రసాద్, కిషోర్ తేజ, కొఠారి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు