మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- మ‌హిళ‌లు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. మ‌హిళా సాధికారిత కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం సిఎల్ టి సెంట‌ర్ లో మెప్మా ఆర్పీల‌కు ట్యాబ్ ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 169 ఆర్పీల‌కు గాను 153 మందికి ట్యాబ్ లు ఆయ‌న అంద‌చేశారు. ట్యాబ్ లో 60 యాప్ లు ఉన్నాయ‌ని, అన్నీ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, స‌ర్వేల‌కు సంబంధించిన‌వని ఆయ‌న చెప్పారు. ఇక‌పై ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్స్ ప్ ద్వారానే అందించాల‌ని సిఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు నిర్ణ‌యించార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ అందించే సంక్షేమ ప‌థ‌కాల‌ను పార‌దర్శకంగా చేర‌వేయాల‌ని ఆయ‌న కోరారు. . సాంకేతికంగా వ‌స్తున్న మార్పుల‌ను మ‌హిళ‌ల‌ను త్వ‌రగా నేర్చుకుని పురుష‌ల‌తో పోటీ ప‌డాల‌ని ఆయ‌న సూచించారు. మ‌హిళ‌ల‌కు ఏకాగ్ర‌త ఎంతో ఎక్కువ‌ని ఆయ‌న చెబుతూ మ‌హిళ‌లు అనుకుంటే సాధించ‌లేనిది ఏమి లేద‌ని ఆయ‌న అన్నారు. కాగా 130 మంది డిజీ ల‌క్ష్మీల‌కు బ‌యోమెట్రిక్ డివైజ్ ల‌ను ఆయ‌న అందించారు. స్వ‌యం ఉపాధి, వ్యాపార రంగాల్లో మ‌హిళ‌లు రాణించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం తీసుకుంద‌ని వాటిని మ‌హిళ‌లు వినియోగించుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఎంఎం లు కృష్ణ‌వేణి, సోమశేఖ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణా, జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజా రెడ్డి, సిఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..