భర్తను మోసం చేసి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య – 8 మంది అరెస్టురెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హత్య కేసు కొద్ది రోజుల్లో ఛేదనగద్వాల పోలీసులు అద్భుత అన్వేషణతో నిందితుల అరెస్ట్

గద్వాల, జూన్ 26 (మన న్యూస్):– తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన దారుణ ఘటన Jogulamba గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మర్డర్ మిస్టరీని కొద్ది రోజుల వ్యవధిలోనే ఛేదించి, మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసుల చర్యకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్యకేసును పత్రికా సమావేశంలో వివరించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, IPS గారు – ఘటన వివరాలను వెల్లడించారు: కేసు నేపథ్యం:– గద్వాలకు చెందిన గంట తేజేశ్వర్ (32) అనే సర్వేయర్ జూన్ 17వ తేదీన అదృశ్యమయ్యాడు. తమ్ముడు కనిపించకపోవడంతో తేజవర్ధన్ అనే సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గద్వాల పట్టణ ఎస్సై ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలైంది.

తদন্তలో బయటపడిన షాకింగ్ నిజాలు:– తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకి కర్నూల్‌కు చెందిన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో అక్రమ సంబంధం ఉండటం, వీరిద్దరూ కలిసి తేజేశ్వర్‌ను హత్య చేయాలని కుట్రపట్టిన సంగతి విచారణలో బయటపడింది. తిరుమలరావు తన పరిచయాలను ఉపయోగించి ముగ్గురు వ్యక్తులకు సుపారీగా డబ్బు ఇచ్చి హత్యను ఆచరింపజేశాడు. మాయ మాటలు చెప్పి తేజేశ్వర్‌ను కారులో తీసుకెళ్లి, మద్యం తాగించి, దారిలోనే కొడవళ్ళతో నరికి హత్య చేశారు. మృతదేహాన్ని కెనాల్‌లో పడేసిన అనంతరం సాక్ష్యాలను మాయం చేశారు. అరెస్టు అయిన నిందితులు: తిరుమల రావు (కర్నూల్ – మేనేజర్), ఐశ్వర్య (భార్య), కుమ్మరి నాగేష్, పరుషరాముడు, చాకలి రాజు, మోహన్ (జమ్మిచేడు), తిరుపతయ్య, సుజాత (ఐశ్వర్య తల్లి),

స్వాధీనం చేసుకున్న వస్తువులు :- హత్యకు ఉపయోగించిన కారు, 2 కొడవళ్ళు, కత్తి, ₹1.20 లక్షల నగదు, 10 మొబైల్ ఫోన్లు, GPS ట్రాకింగ్ పరికరం, నిందితుల నకిలీ బట్టలు

పోలీసుల ప్రతిభకు మెప్పు: -జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు గారి మార్గదర్శకత్వంలో డిఎస్పి వై. మొగిలయ్య, సీఐ టంగుటూరి శ్రీను నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు – సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా కేసును ఛేదించాయి. పుల్లూరు చెక్‌పోస్టు వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో ముఖ్య పాత్ర పోషించిన ఎస్సైలు – కళ్యాణ్ కుమార్, శ్రీకాంత్, హరి, నందికర్, మల్లేష్, ఐటీ సెల్ ఎస్సై సుకూర్, ఇతర సిబ్బందిని ఎస్పీ క్యాష్ రివార్డుతో అభినందించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..