మత్తు మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : డా.డి సునీత ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంను జాతీయ సేవ పథకం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్ధాల గూర్చి తెలియజేస్తూ మాదక ద్రవ్యాలు తీసు కొన్న వ్యక్తులకు గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక సమస్యలు వంటి ఎన్నో వ్యాధులకు దారితీస్తాయని ఆదేవిదంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని.ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని, మాదక ద్రవ్యాలలో వివిధ రకాలున్నాయని నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్,గంజాయి, మారిజువానా, కొకైన్,ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవని వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీనిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరని కాబట్టి, మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా ముఖ్యం విద్యార్ధులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికిముఖ్య అతిధిగా ఏలేశ్వరం ఎస్సై రామలింగేశ్వర రావు,వారు హాజరై మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే అంశాలను విద్యార్దులకు ఉదాహరణనలతో తెలియజేస్తూ, మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుంటారని, మాదక ద్రవ్యాల సరఫరా ఒక చెయిన్‌లా సాగుతుందని చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూ ఉంటుందని సాధారణంగా సిగరెట్లు,ఆల్కహాల్ ద్వారా మాదక ద్రవ్యాలను తీసుకోవడం మొదలవుతుందని ఒక్క సారి ఈ రంగం లోకి దిగిన యువత యొక్క భవిష్యత్ నాశనం అవుతుందని కాబట్టి యువత ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. యన్.యస్.యస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా ప్రయాగ మూర్తి ప్రగడ మాట్లాడుతూ యువత చెడు మార్గం లోకి వెళ్ళడం వల్ల కుటుంబాలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులకు గురవ్వడమే కాకుండా సమాజంలో విలువను కోల్పోయి మానసిక క్షోభకు గురై ఆ త్మహత్యాలకు దారితీస్తుందని కాబట్టి యన్.యస్.యస్ వాలంటీర్లు భాద్యత వహించి ఎక్కడైన మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే స్థానికి పోలీసులకు తెలియజేసి సమాజ మరియు దేశ అభివృద్దిలో పాల్గొనాలని కోరారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీ కె. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ యువత చదువు పై మాత్రమే దృష్టి పెట్టాలని చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తరువాత విద్యార్దుల చేత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమలో అధ్యాపకులు వి రామ రావు,కె సురేష్, డా.య స్ కె మదీనా, డా శివ ప్రసాద్, బి వీరభద్ర రావు, శ్రీలక్ష్మి , డా. బంగార్రాజు, పుష్ప , కుమారి మేరీ రోజలిన ,రాజేష్ ,సతీశ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది అదిక సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///