

చిత్తూరు మన న్యూస్:-కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహా శక్తి క్షేత్రము నందు ఆదివారం నాడు ఏర్పాటు చేసిన కార్తీక అర్ధనారీశ్వర దీపోత్సవం నకు ఆర్య వైశ్యుల నుండి అనూహ్య స్పందన లభించిందని చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి గోపాల కృష్ణమూర్తి పిరమిడ్ కేంద్రం నందు,, ఆదివారం ఉదయం 11 గంటలకు శ్రీ వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి శైలారావు సారధ్యంలో దాదాపు 200 మందికి పైగా మహిళలు ఉసిరి చెట్టు క్రింద గౌరీ దేవిని అలంకరించి నెయ్యి దీపాలను వెలిగించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వ హించారన్నారు. అనేక ఉసిరి చెట్ల సముదాయం కల్గిన ఈ ప్రాంగణంలో ఉసిరి చెట్ల దగ్గర మరియు రుద్రాక్ష చెట్ల దగ్గర నెయ్యి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో శివ పార్వతులను కొలిచారు చిత్తూరు నగర వైశ్య ప్రముఖులు శ్రీ విష్ణు భవన్ అధినేత వేంకట స్వామీ , మోహన్ , చెట్టియర్ స్వీట్స్ అధినేత, పాండియన్ వాసవి సప్లేయర్స్ శ్రీధర్ మూర్తి, కె వి ఆర్ సి జువలరి అధినేత శ్రీ నారాయణ మూర్తి వాసవి రీజియన్ చైర్మన్ నాగేంద్ర, రామమూర్తి సెక్రటరీ చంద్రశేఖర రావు వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు లీలా మోహన్, నటకల బాలాజీ నటకల జయశ్రీ , ఆర్యవైశ్య మహాసభ అర్బన్ జిల్లా అధ్యక్షులు ద్వారకనాథ్, బైసాని బాబు రావు గిరీంపేట రవి మరియు అనేక మంది వైశ్య ప్రముఖులు దాదాపు 400 మంది పాల్గొన్నారన్నారు. ప్రారంభం నుండి చివరి దాకా ఎటువంటి విఘ్నాలు లేకుండా దగ్గరుండి లిటిల్ రోజ్ డైరెక్టర్ లోహిత్ కుమార్ మరియు హెల్లొ కిడ్స్ డైరెక్టర్ శ్రీమతి పవిత్ర లోహిత్ , కన్వీనర్ శ్రీమతి రాధిక తమ సేవలను అందించారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గోపాల కృష్ణమూర్తి రాధిక దంపతులను వాసవి మహిళా సంఘం మరియు వాసవి క్లబ్ గ్రేటర్ చిత్తూరు తాళంకి శ్రీనివాస్, వాసవి సప్లయర్ శ్రీనివాసమూర్తి దూస్సాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్య క్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహా శక్తి క్షేత్రము తరఫున నిర్వాహకులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు