మా ఊరు బడి మాకు కావాలి – అని బాయ్ కట్ చేసిన విద్యార్థులు.పట్టించుకోని అధికారులు…….కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన.

గూడూరు,( మన న్యూస్) తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని నెర్నూరు గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8, తరగతులను ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువెంగనాయపల్లి పాఠశాలకు తరలించవద్దు అని బుధవారం రోజు విద్యార్థుల తల్లిదండ్రులు, కె.వి.పి.ఎస్ అడపాల ప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్న పలంగా 47 మంది ఇక్కడ చదువుతున్న విద్యార్థులను ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువెంగ నాయపల్లి పాఠశాలకు మార్చడం ఏమిటని వారు ప్రశ్నించడం జరిగింది. అంతదూరం మా పిల్లలు వెల్లరేరని పాఠశాలలు ప్రారంభమైన జూన్ 12వ తేదీ నుండి 15 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆయా గ్రామాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆ పాఠశాలకు వెళ్ళనీయ కుండా నిలిపి చేయడం జరిగింది. దీనితో ఆ పాఠశాల ప్రాంగణం విద్యార్థులు లేక వెల,వెల బోతూ తరగతి గదులలో ఖాళీ బెంచీలు, నోట్ బుక్స్, ఉపాధ్యాయులకు దర్శనమిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును సౌకర్యాలను, దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చదువుతున్న వాళ్లని అక్కడే నిలుపుదల చేయాలని వారి తల్లిదండ్రులు కె.వి.పి.ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్ మెంట్ చైర్మన్ దాసరి మోహన్, నాయకులు బి.వి.రమణయ్య,పామంజి మణి,ఆర్.శ్రీనివాసులు,ఏంబేటి చంద్రయ్య,కె.ధనమ్మ, ఎస్.నరసమ్మ,పి.లక్ష్మి దేవమ్మ, సి.హెచ్.రమేష్,డి.మల్లికార్జున, దాసరి శీనయ్య,పల్లం రాజు, బి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..