

- అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేస్తాం,
- ఒక సేవకుడిగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను
- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి
కావలి,మనన్యూస్, నవంబర్ 25 :- అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి అభివృద్ధి పై స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అధికారులు, సిబ్బంది తో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో నివాసం వుంటూ, ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు నివాసం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీ లోపల మున్సిపల్ కార్యాలయంలో నివాస స్థలం, కాలనీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులన్నీ త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. కావలి అభివృద్ధికి నిరంతరం నాయకుడు గా కాకుండా సేవకుడు గా సేవ చేస్తానని తెలిపారు. నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నడపడానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, జనసేన నాయకుడు పోబ్బా సాయి విఠల్, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..
