

మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే ఉన్నాయి. మన సాలూరు టౌన్ మున్సిపల్ ఆఫీసులో ఎసిబి అధికారులు మున్సిపల్ కమిషనర్ సీపాన జయరాం పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం లో ఆయన గతం లో విధులు నిర్వహించిన నంద్యాల,విశాఖపట్నం,శ్రీకాకుళం తో పాటు వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు.రెండు వారాల క్రితం సాలూరు కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు.