

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్గల్ మండలంలోని కటే పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు కూతురు నిహారిక జ్ఞాపకార్థం 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పలకలను మండల విద్య అధికారి ప్రవీణ్ కుమార్, గ్రామ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ లు కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి చేయడంలో ప్రవీణ్ కుమార్ ఎంఈఓ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలను బాగు చేసేందుకు మంచి సంక్షేమలు వచ్చాయని కానీ కాటేపల్లి పాఠశాలను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు ఉన్నాయని అన్నారు. పెద్ద కొడంగల్ హైస్కూల్ ను బ్రహ్మాండంగా తయారు చేశారు.కానీ కాటేపల్లి పాఠశాలకు పట్టించుకోకపోవడంతోనే పాఠశాలలన్నీ శిధిలావస్థలో ఉన్నాయని గుర్తు చేశారు. మండలంలో రెండో స్థానంలో కాటేపల్లి పాఠశాల ఉన్న మన అభివృద్ధిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపిన బాటలో నడుస్తూ ఉన్నంత శిఖరాలకు ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మొగులా గౌడ్,విఠల్, హనుమాన్లు,చాంద్ పాషా, గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తదితరులున్నారు.
