

మన న్యూస్ పాచిపెంట జూన్ 23:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో ఆదివాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ గాంధీ బొమ్మ నుండి ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జన్ని రామయ్య చెల్లూరి జగన్నాథం కొర్ర కళ్యాణ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుర్రు రామారావు కొర్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాతల కాలం నుండి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సకాలంలో నేటి వరకు పట్టాలు మంజూరు చేయకపోవడం వలన ఆ భూములను పెత్తందారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీని కారణంగా గిరిజనులకు బతకడానికి అవకాశం లేక వలసలు పోతున్నారని ఇప్పటికైనా అధికారులు యుద్ధ ప్రాతిపదికన సాగు పట్టాల మంజూరు చేయాలని అటుహక్కులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు 48 సర్వేనెంబర్ కుడుమూరు భూములకు 782 ఎకరాలు ప్రభుత్వ భూమికి పట్టాలు మంజూరు చేయాలని కొండ తాడూరు 113 సర్వే నెంబర్ 210 ఎకరాలు ప్రభుత్వ భూమికి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, వర్షం పడుతున్న ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళనకు రావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనులు పేదల యొక్క బతుకులు మారలేదని అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాలు చొప్పున పట్టాలు మంజూరు చేయాలని, డిమాండ్ చేశారు.కానీ అలా జరగడం లేదు 20 సెంట్లు ఎకరం 5 ఎకరాలు సాగు చేస్తే రెండు ఎకరాలు ఎనిమిది ఎకరాలు సాగు చేస్తే ఎకరం నర ఇలా పట్టాలు మంజూరు చేస్తున్నారని అటవీ హక్కుల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. అలాగే మోదుగ బొర్రమామిడి మూటకూడు పంచాయతీలో పలు గ్రామాలకు విశాఖ జిల్లా అనంతగిరి రెవిన్యూ లో భూములు ఉండడం వలన సర్వేలు జరిపి వారికి హక్కులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం కలెక్టర్ కి ఇతర ఉన్నతాధికారులు కూడా తెలిపిన నేటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మాపురం ఇనాం భూములకు నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం వలన రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెద్దగడ్డ జలాశయంలో నష్టపోయినటువంటి మడవలస నిర్వాసిత గిరిజనులకు 46 కుటుంబాలకు రెండు ఎకరాలు చొప్పునపట్టాల రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చినారు
అయినా వారికి నేటికీ దశాబ్ద కాలంగా పోరాడుతున్న భూములు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే. ఆందోళన చేపడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు పెద్దలు పాల్గొన్నారు. ఎమ్మార్వో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎమ్మార్వో రవి మాట్లాడుతూ అటవీ పట్టాలు విషయంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఉన్న మేరకు పట్టాలు పంపిణీ విషయంలో పరిష్కారం చేస్తామని అన్నారు.
విశాఖ జిల్లా అనంతగిరి రెవిన్యూ లో పాచిపెంట మండలం మోదుగ పంచాయతీ బుర్రమామిడి మూటకూడు పంచాయతీలో ఉన్నటువంటి భూమి రికార్డులను పరిశీలన చేసి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళామని అతి త్వరలో పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. అలాగే మిగతా భూ సమస్యలు పట్ల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
