

* *గోదా రంగనాథ గోష్టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ*
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్టి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు అనగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా గోదా రంగనాథ గోష్టి గురువర్యులు గుదిమెళ్ళ లక్ష్మణాచార్యులు,జయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యమని,ఈ శ్రీరామనామ క్షేత్రంలో జరుగుతున్న లక్ష దీపోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరమశివుడు ఆశీస్సులు పొందాలని కోరారు.అలాగే ఆలయ కమిటీ సభ్యులైన చాట్ల పుష్పా రెడ్డి,రెడ్నం రాజా,పత్రి రమణ,గోగులు బుజ్జిలు మాట్లాడుతూ ఆంధ్రా భద్రాద్రి క్షేత్ర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలనే సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని,భక్తులు యావన్మంది విచ్చేసి దీపాలను వెలిగించి స్వామివార్ల కృపా కటాక్షాలు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో గోదా రంగనాథ మహిళా కమిటీ సభ్యులు,నాగ ఆంజనేయులు,మేడిద నాగార్జున పాల్గొన్నారు.