శ్రీమతి నారా భువనేశ్వరి – ఒక నిశ్శబ్ద ధైర్యం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- కష్టాలకు వెరవని ధైర్యం, సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం, మహిళా జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నారా భువనేశ్వరమ్మ ఒక నిశ్శబ్ద ధైర్యం అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రాముని కుమార్తె, తెలుగువారి ఆత్మవిశ్వాసానికి స్పూర్తి ప్రదాత నారా చంద్రబాబు ధర్మపత్ని, తెలుగువారి భవిష్యత్తు పై భరోసా కల్పించిన నాయకుడు నారా లోకేష్ మాతృమూర్తి శ్రీమతి నారా భువనేశ్వరి కి 65 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, భువనమ్మకు దివ్యాశీస్సులు అందించమని జయరాం రావు వీధి లోని శ్రీ శీతలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతూ, ఆర్తులకు అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళిగా జీవించాలని కోరుకుంటూ పూజలు చేశారు.
బిసి తేజం రవీంద్రుని కోసం ప్రార్ధనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి,మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు,బిసి తేజం కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పేరున కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అర్చనలు చేయించడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వంలో తీవ్రమైన అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణమే వారి వద్దకు వచ్చి అండగా నిలిచిన బిసిల పాలిట ఛత్రపతి మన రవీంద్రన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్,వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,
తిరుపతి పార్లమెంటు నాయకులు బీమాల భాస్కర్, సంజాకుల మురళీకృష్ణ, పూల శేఖర్, రమేష్, మల్లికార్జున, విద్యుత్ సంస్థ ఉద్యోగ సంఘ నాయకుడు ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///