తల్లుల కష్టాలు తీర్చేవాడు చంద్రన్న-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ.

శ్రీకాళహస్తి, మన న్యూస్.చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ కోసం కష్టాలు పడుతూ, తమ పిల్లల చదువులు కోసం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న తల్లుల కష్టాలు తీర్చే వాడు మన చంద్రన్న అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు.గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన *సూపర్ సిక్స్* పధకాల లో ఒకటైన తల్లికి వందనం హామీ ని నెరవేరుస్తూ ఈ నెల పన్నెండవ తేదీన డబ్బులు పిల్లల తల్లుల ఖాతాలోకి జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని,కృతజ్ఞతగా స్థానిక 18 వార్డు, పూసల వీధిలో గల లబ్దిదారుల ఇంటి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని, రాష్ట్రంలో ఉన్న తల్లుల ఖాతాల్లో, “తల్లికి వందనం” పధకం కింద ఒకే రోజు రూ.10 వేల కోట్లు జమ చేసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని కొనియాడారు.’తల్లికి వందనం’ పిల్లల చదువులకు ఇం’ధనం’గా ఉపయోగపడటంతో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని, నలుగురు పిల్లలు ఉన్న షేక్ ఆశ అనే తల్లి ఖాతాలో ఒక్కో పిల్లవాడికి 13,000/- చొప్పున తన నలుగురు పిల్లలకు సంబంధించిన 52,000/- జమ అయ్యింది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తమలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి అండగా నిలిచి, తమ కుటుంబంలో చదువుకుంటున్న ప్రతీ పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు *తల్లికి వందనం* పేరుతో తమకు అందించిన చంద్రబాబు నాయుడు కి, పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో గల తల్లుల ఆశీస్సులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి చిరస్థాయిగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,శ్రీకాళహస్తి పురపాలక సంఘం 18 వ వార్డు మాజీ కౌన్సిలర్లు డా.నివేదిత మోరె, షేక్ మహబూబ్ భాషా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మునిరాజా యాదవ్,వజ్రం కిషోర్,సయ్యద్ చాంద్ భాషా,కోట చంద్రశేఖర్,బీమాల భాస్కర్, మణి,మురళీ నాయుడు,మహ్మద్ రఫీ,నూర్ మొహమ్మద్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..