

మన న్యూస్, పొదలకూరు:సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి సోమిరెడ్డి కుటుంబం కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజైన బుధవారం పొదలకూరు మండలం అమ్మవారిపాళెంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ఆరా తీసిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి.ప్రతి ఇంట్లో ప్రజల బాగోగులు తెలుసుకోవడంతో సమస్యలపై ఆరా తీశారు.టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు అమలులోకి రానున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలపై ప్రజలకు వివరణ ఇచ్చారు.ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి.






