

మన న్యూస్ తవణంపల్లె జూన్-11
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలంలోని ఏ.గొల్లపల్లిలో బుధవారం ఏరువాక పౌర్ణమి ఉత్సవాన్ని గ్రామీణ రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి స్ధానిక, మండల నాయకులు, రైతులు, అధికారులు పూలమాలలు, దుశ్శాలువతో సత్కరించగా, మహిళలు కర్పూర హారతులు అందించి అపూర్వ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రైతులు తమ సంప్రదాయ పద్దతుల్లో ఎద్దులను అలంకరించి, నాగలి పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్దంగా భూదేవికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి పొలంలో దుక్కి దున్ని పండుగను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. అని, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అలాంటి అన్నదాతలకు అంకితంగా జరుపుకునే ఈ ఏరువాక పౌర్ణమి రైతు జీవితం పట్ల గౌరవాన్ని తెలిపే పండుగ” అని అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో రైతులకు వానాకాలం పంటలపై అవగాహన కల్పించడంతో పాటు, సాగునీటి ప్రాధాన్యత, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై స్పష్టత నిచ్చారు. సంప్రదాయానికి ప్రతిరూపంగా ఏరువాక పౌర్ణమి
ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక పౌర్ణమి కర్షకుల పండుగగా ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతుందన్నారు. వర్ష ఋతువు ఆరంభంలో మృగశిర నక్షత్ర రాకను స్వాగతిస్తూ భూదేవిని పూజించి నాగలి దుక్కి తొలిసారి దున్నడం ద్వారా రైతులు తమ వ్యవసాయ సీజన్‌ను ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె క్లస్టర్ ఇంఛార్జ్స్ మోహన్ నాయుడు, సునీల్ చౌదరి, బంగారుపాళ్యం మార్కెట్ కమీటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, సర్పంచ్ ప్రవీణ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, రైతు సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
