

మన న్యూస్ తవణంపల్లి జూన్-11
తవణంపల్లి మండలంలో పాఠశాలల పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొత్తం 8 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి మోడల్ పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు తో పాటు, 1 నుండి 5 తరగతుల వరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా మొత్తం 5 మంది ఉపాధ్యాయులు నియమించబడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా, మండలంలోని అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు స్వీకరించారు. ఇది విద్యా నిర్వహణ పరంగా ఎంతో కీలకమైన అడుగుగా భావించవచ్చు. ఈ సందర్భంగా యం ఈ ఓ పి.హేమలత మాట్లాడుతూ మోడల్ స్కూల్స్లో సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ ప్రతి విద్యార్థికి తగిన శ్రద్ధతో విద్య అందించడం నాణ్యమైన విద్యా ప్రమాణాలు కల్పించగలగడం
వంటి ప్రయోజనాలు కలుగనున్నాయి. అందువల్ల తల్లిదండ్రులైన మీరు ప్రభుత్వ మోడల్ పాఠశాలల ద్వారా అందుతున్న ఉచిత విద్య
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కానుక మధ్యాహ్న భోజన పథకం నిష్కళంకమైన విద్యా వాతావరణం
వంటి సదుపాయాలను వినియోగించుకోవాలని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సూపర్ ఫైన్ బియ్యం అనగా సన్నబియ్యం ప్రతి పాఠశాలకు సరఫరా చేయబడును. మీ పిల్లలను సమీప మోడల్ పాఠశాలల్లో చేర్పించి, వారి భవిష్యత్తును మెరుగుపరిచే దిశగా ముందడుగు వేయాలని సూచించడం జరిగింది. తెలిపారు.