అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

  • శంఖవరం తాహసిల్దారు, ఎంపీడీవోలకు జనసేన నేత మేకల కృష్ణ ఫిర్యాదు…

శంఖవరం మన న్యూస్ అపురూప్ : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని కోటనందూరు – కత్తిపూడి గ్రామాల మధ్యలోని రోడ్లు భవనాల శాఖ రహదారి మార్గం (సర్వీస్ రోడ్డు)పై రౌతులపూడి మండలం రాఘవపట్నం, గుమ్మరేగుల, సంతపైడిపాల, ములగపూడి, మాతయ్యపేట, ఉప్పంపాలెం, జల్దాం గ్రామాలు, అనకాపల్లి జిల్లా నాతవరం, నర్సీపట్నం మండలాల నుంచి ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా రవాణా నియమ నిబంధనలు పాటించకుండా బ్లాక్ మెటల్, లేట్రేట్ క్వారీల నుంచి లాటరైట్, నల్ల రాయి, ఎర్ర రాయి, గ్రావెల్, చెరువుల మట్టిని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి వందలాది లారీల్లో అతి బరువు, భారీ వేగంతో తరలిస్తూ ప్రజలు, పాదచారులు, విద్యార్థులు, పెంపుడు జంతువులు, మూగజీవాలు, వాహన ప్రయాణీకులకు ప్రమాదాలను కలిగిస్తూ, గ్రామీణ రహదారులను నిత్యం ధ్వంసం చేస్తూ పర్యావరణ, వాతావరణ కాలుష్యానికి కారణమవుతోన్న పెట్టుబడిదారీ వర్గాల వ్యాపార సంబంధ భారీ టిప్పర్ ట్రైలర్ లారీలను 15 రోజుల్లో నిలిపివేయాలని కోరుతూ శంఖవరం మండల తాహసిల్దార్ అల్లాడి తాతారావు, శంఖవరం మండల ప్రజా పరిషత్తు పూర్తి అదనపు బాధ్యతల అభివృద్ధి అధికారి నూనె మురళీకృష్ణ గంగాధర్ ప్రసాదుకు జిల్లా తంతి సమాచారశాఖ సలహా మండలి సభ్యుడు, శంఖవరం జనసేన పార్టీ అధ్యక్షుడు, స్వచ్ఛంద సేవాకర్త మేకల కృష్ణ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ తాతారావు తో మేకల కృష్ణ మాట్లాడుతూ, సమస్యను సమగ్రంగా‌ వివరించారు.‌ ప్రజా రవాణా, ప్రజలకు నిత్యావసర వస్తువుల సరకుల రవాణా‌, ప్రభుత్వ భవనాలు, పరిపాలనా సముదాయాలు, ప్రజలు నివాస గృహాలు, వ్యాపార నిర్మాణాలు కొరకు మెటిరీయల్ తరలించు కొనుటకు మాత్రమే ప్రజల సౌకార్యార్థం ప్రభుత్వం నిర్మించిన కోటనందూరు – కత్తిపూడి రోడ్డులో ఈ భారీ లారీలు రౌతులపూడి, బంగారయ్యపేట, శృంగవరం, మెరకచామవరం, శంఖవరం, శాంతి ఆశ్రమం అడ్డురోడ్డు, నెల్లిపూడి, కత్తిపూడి గ్రామాల మీదుగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఒక్కోటీ 40 టన్నుల బరువున్న ఈ లారీల్లో ఒక్కోటీ 5 నుండి 8 టన్నుల బరువు కల్గిన బండరాళ్ళతో లారీ మొత్తం మీద 50 టన్నులకు మించిన బరువు గల సరుకును తరలిస్తున్నాయి. ఫలితంగా నిత్యం అధిక బరువు కల్గిన లారీలు చూసి ప్రజలు బెంబెలెత్తి పోతున్నారు. సైకిల్, ద్విచక్ర, కారు, ఆటోలు, నడిచి వెళ్ళే మనుషులు ప్రయాణం చేయడానికి హడలిపోతున్నారు. ప్రజా, ప్రభుత్వం అవసరాల నిమిత్తం ఉపయోగించవలసిన సర్వీసు రోడ్డులో ఫిట్నెస్ సక్రమంగా లేని వందలాది లారీలు కాకినాడ, ఉప్పాడ, మూలపేట, తదితర ప్రాంతాలలో సముద్రం వద్ద పోర్టులు, ఇతర వ్యాపార, కాంట్రాక్టు పనులు, రియల్ ఎస్టేట్ నిర్మాణాల నిమిత్తం వాహన సామర్ధ్య పరిమితికి మించిన అతి బరువుతో భారత్ బెంజ్, టాటా కంపెనీల లారీలు అతివేగంగా వెళ్తూన్నాయి. అందువల్ల అనేక ప్రాంతాల్లో ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, వాతావరణ‌ కాలుష్యానికి కారణమవుతున్నాయని తాహసిల్దారుకు కృష్ణ వివరించారు. గుమ్మరేగుల నుండి కత్తిపూడి మధ్యలో రౌతులపూడి, శృంగవరం వద్ద బ్రిటీషర్ల వలస పాలనలో నిర్మించిన పురాతన వంతెనలు, శంఖవరం, రౌతులపూడిల్లోని దుర్గాదేవి దేవాలయాలు వద్ద పురాతన వంతెనలు ఇప్పటికే శిధిలావవస్థలో ఉన్నాయి. వీటిపై 40 నుండి 50 బరువు గల వాహనాలు ప్రయాణిస్తే అవి ఏదో రోజు కూలిపోతాయనే కనీస పరిజ్ఞానం కూడా రోడ్లు, భవనాల శాఖ అధికార్లకు లేకపోవడం శోచనీయ మన్నారు. అతి బరువుతో లారీలు ఈ వంతెనలపై రవాణా చేస్తున్నప్పుడు అవి కూలిపోతే అదే సమయంలో జన రవాణా చేయుచున్న ఆర్.టి.సి. బస్సులు, స్కూల్ బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు విలువైన మానవ ప్రాణాలు కోల్పోవలసిన ప్రమాదం ఉందనే కనీస పరిజ్ఞానం ఆర్ & బి శాఖ అధికారులకు లేకపోవడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం అన్నారు. అందువల్ల ఈ అక్రమ భారీ వాహనాల రావాణాను 15 రోజుల్లో పూర్తిగా నిలిపి వేయడానికి తగు చర్యలు తీసుకోవాలని మేకల కృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు, శంఖవరం మండలం కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన జనసేన నేత గొర్లి నాగేశ్వరరావు ఉన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా