

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లెపండుగ.మన న్యూస్, నెల్లూరు రూరల్ ,జూన్ 8:నెల్లూరు రూరల్ లో ఆదివారం ఉదయం కాకుపల్లి, మాదరాజుగూడూరు, పెనుబర్తి మరియు కలివెలపాలెం గ్రామాలలో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలసి ప్రారంభోత్సవాలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు . గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేసాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అన్నిరకాలుగా ఆంధ్రప్రదేశ్ ను ముందుకు నడిపిస్తూ, మనకోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

