రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కూటమి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కావలి పట్టణంలోని మన్నెం గోపాల కృష్ణారెడ్డి కళ్యాణమండపంలో ఆదివారం టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సొంతంగా కావలిలో మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ రావడం జరిగిందని, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తల కృషి ఎనలేనిదని తెలిపారు. ఇదేవిధంగా రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మునిసిపాలిటీని కైవసం చేసుకుందామని తెలిపారు. కావలి పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యక్రమంలో బిజెపి, జనసేన నాయకులను కలుపుకొని పోదామని, వారికి ప్రాధాన్యత ఇద్దామని తెలిపారు. కావలి పై చంద్రబాబుకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నదని, అందుకే అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల వయసులో దేశం కోసం మోడీ, రాష్ట్రం కోసం చంద్రబాబు చేస్తున్న కృషి ఎనలేనిదని తెలిపారు. నాకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదని, నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం అని తెలిపారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ లోకేష్ ను ముఖ్యమంత్రి గా చేసుకొని ఋణం తీర్చు కుంటానని తెలిపారు. 2024 ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరిని వదులుకోనని తెలిపారు. నేను కష్టాల్లో ఉన్న సమయంలో చిన్న సహాయం చేస్తేనే మర్చిపోలేనని అలాంటిది రెండు నెలల పాటు నా ఎన్నికల కోసం కష్టపడిన నాయకులను కార్యకర్తలను ఎలా మర్చిపోగలనని అన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజా సమస్యల పరిష్కారం లో ఉంటామని, రాత్రి 7 గంటలు తరువాత నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను స్వయంగా తెలుపుకోవచ్చని తెలిపారు. రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ ఉన్నానని, మీ ప్రోత్సాహం కూడా అవసరమని తెలిపారు. వ్యాపారాలను సైతం పక్కన పెట్టి ప్రజాసేవ చేస్తున్నానని, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం పార్టీ స్టేనుల కోసం నిరంతరం అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, విధ్వంసం నుండి అభివృద్ధి వైపుకు రాష్ట్రాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. కావలిని కాపు కాస్తానని, ముఖ్యమంత్రి సహకారం తో కావలి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని తెలిపారు. దగదర్తి నుండి కొంతమంది నాయకులు, కావలి నుండి కొంతమంది నాయకులు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు త్వరలోనే వారిని పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, బోగోలు మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కావలి రూరల్ మండల టిడిపి అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, అల్లూరు మండల టిడిపి అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, జనసేన కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి విటల్, సిద్దు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు