

మన న్యూస్ పాచిపెంట జూన్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఎండీయూ వాహనాలను కొనసాగించాలని నాణ్యమైన సరుకులు అందించాలని కోరుతూ పద్మాపురం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కే రాజారావు నీలాద్రి సింహాచలం బి చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎండియు వాహనాలు రద్దు చేయడం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని దాదాపు 18500 కుటుంబాలు ఈ వాహనాల్లో పనిచేసి జీవనం సాగిస్తున్నారని వారందరికీ భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఎండియు వాహనాలను కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు అలాగే చాలామంది పేదలు పంట పొలాల్లో పనిచేసుకుని ఎండియు వాహనాలు ద్వారా రైసు తీసుకోకపోతే వారికి డిపోలు దగ్గరికి వెళ్లి రేషన్ డిపోల్లో సరుకులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అవినీతి జరుగుతుందని నెపంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతారని అన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి సరుకులు అన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నగదు బదిలీ పథకం అమలు చేయాలని ప్రభుత్వ ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు అలా జరిగితే పేదలు బియ్యం బయట కొనుక్కోలేరని ధరలు నియంత్రణలో ఉండవని సామాన్య ప్రజలు కొనుగోలు శక్తి లేక బతకడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుందని అందువలన ప్రజా పంపిణీ వ్యవస్థ అన్ని రకాల సరుకులు నాణ్యత తో కూడుకున్నటువంటి సరుకులు మంచి సన్నబియ్యం ప్రజలకి అందించే విధంగా చర్యలు తీసుకుంటే కచ్చితంగా ప్రజలందరూ డిపోల ద్వారా సరుకులు తీసుకుంటారని ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే ఎక్కువమంది సర్వర్లు సక్రమంగా పనిచేయక రేషన్ డిపోల వద్ద రైస్ కి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎండియు వాహనాలను నడిపించి రేషన్ సరుకులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అదే మాదిరిగా రేషన్ డిపోలను కూడా కొనసాగించాలని. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా నిత్యం సరుకులు అందించి ఆదుకోవాలని.ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని తెలిపారు. పద్మాపురం గ్రామం వద్ద నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాలు ,ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు శెట్టి త్రినాధ సిహెచ్ గంగమ్మ పెదకాపు లక్ష్మి పి రవి తదితరులు పాల్గొన్నారు.