భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

  • యాజమాన్యంపై టీడీపీ నేత పర్వత సురేష్ ఆగ్రహం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): సృష్టికి ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ధిగాంచినవి పల్లె పట్టుకొమ్మలు… చక్కని ప్రకృతి లో వ్యవసాయం చేస్తూ, తమ పిల్లలను బడికి పంపుతున్న బుల్లి రోడ్లో పెద్ద పెద్ద వాహనాలు… గత కొన్ని సంవత్సరాలుగా భారీ లోడుతో నిత్యం ప్రజల మధ్య ఉన్నా రహదారి పై తిరుగుతున్న టిప్పర్ లారీలు…టిప్పర్లను ఆపే సత్తా ఎవరికి లేదా అనే విషయంపై ప్రజలకు అంతుచిక్కని వైనం… రోడ్డుపై టిప్పర్ లారీలు వెళ్తున్నాయా లేక ఒక ట్రైనే వెళ్తుందా తికమక పడుతున్న ప్రజలు… ఎన్నో మరణాలు ఎన్నో ప్రమాదాలు సంభవించిన అదే తీరు…వివరాల్లోకి వెళితే…కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరంలోని కొత్తుం వారి వీధి సమీపంలోని సాయిబాబా గుడి ఎదురుగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్ర మట్టి (లేటరైట్) తరలిస్తున్న భారీ టిప్పర్ వెనుక చక్రాలు ఊడిపోవడంతో రోడ్డుని ఆనుకొని ఉన్న కాలువలో ఊడిపోయిన చక్రాలు సుమారు 50 అడుగుల దూరంలో పడిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీ ఆగిపోయిన అప్పటికి ఎర్రమట్టి తరలించే లారీలు వరుసుగా ఇదే లైన్లో రావడంతో రోడ్డు ప్రక్కన భారీగా నిలిచిపోయాయి.టిప్పర్ చక్రాలు ఊడిపోవడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు సమీపంలోనే గల అచ్చారావు అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి ప్రహారీని గుద్దుకుంటూ మరో ట్రిప్పర్ వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు ఘటన ప్రాంతానికి చేరుకుని ఆగిపోయిన లారీలను పరిశీలించారు.విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ ఘటన ప్రాంతానికి చేరుకుని ఆగిపోయిన లారీలను పరిశీలించి, సుమారు 12 గంటలు పైబడి లారీలు ఆగిపోతే కాంట్రాక్టర్ ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం ఏమిటి అని లారీల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుండి ప్రతిరోజు మూడు పూటలా రహదారులు తడపాలని, పాఠశాలలకు విద్యార్థులు వెళ్లే సమయంలో లారీలు నిలుపుదల చేయాలని, వందలాదిగా తిరుగుతున్న లారీల సంఖ్య తగ్గించాలని గ్రామంలో ప్రవేశించిన తర్వాత లారీల వేగం అతి తక్కువగా ఉండాలని, ప్రజలు టిడిపి నేత సురేష్ దృష్టికి తీసుకురాగా, ఈ సమస్యను అంతా కాంట్రాక్టర్, అధికారులు దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరిస్తానన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్య చేపడతామన్నారు. సుమారు 12 గంటలు పైబడి లారీలు ఆగిపోతే కాంట్రాక్టర్ ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం తో లారీల యాజమాన్యం పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..