

దేశంలో పేదరికం ఉన్నంతవరకు ఎర్రజెండా వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, శనివారం అశ్వాపురం మండలం లో, చవిటిగూడెం, సండ్రలబోర్డు, గ్రామాలలో సిపిఐ గ్రామ శాఖ సమావేశాలు కారం ధారయ్య,అధ్యక్షతన జరిగాయి
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ అశ్వాపురం మండల కార్యదర్శ అనంతనేని సురేష్, హాజరై మాట్లాడుతూ అశ్వాపురం మండలం లో,ఉన్నటువంటి ఈ గ్రామాలు కనీసం నడవడానికి కాలిబాటన కూడా లేనటువంటి ఈ గ్రామాలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రోడ్లు, విద్యుత్తు, స్కూల్స్,ఇలా గ్రామ కల్వర్టులు అభివృద్ధి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిందని వారు గుర్తు చేశారు. కాలిబాటన లేక ఆఫీసులలో రాత్రివేళ ఉన్నటువంటి సందర్భాలు అనేకం అని వారు గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని , పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఒకప్పుడు సవిటిగూడెం, చింత్రియాల గూడెం, సండ్రలబోర్డు, గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉండేదని నేడు నాయకుల్లో కూడా స్వార్థం ఎక్కువైందని అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని వారన్నారు. అనంతరం, చౌటుగూడెంలో, 15 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, అలాగే సండ్రలబోర్డు 20 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది,ఎన్నుకోబడ్డ కార్యకర్తలు అందరూ సిపిఐ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ అశ్వాపురం మండల సహాయ కార్యదర్శులు, మేలపుర సురేందర్ రెడ్డి, రాయపూడి రాజేష్, ఈనపల్లి పవన్ సాయి,
అక్కినపల్లి నాగేంద్రబాబు, వీరబోయిన జయంతి, కారం ధారయ్య, తెల్లం సునీలు, తెల్లం భీమయ్య, సిపిఐ పార్టీ కార్యకర్తలు,తదిరులు పాల్గొన్నారు…