ఆపితే ఆగేది కాదు…. సర్వేపల్లి ప్రజలలో కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఉన్న అభిమానం….. కాకాని పూజిత

*” ఆపితే ఆగేది కాదు… సర్వేపల్లి ప్రజలలో నాన్న పై ఉన్న అభిమానం” …….కాకాణి పూజిత*మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితమ్మ..ఈ సందర్భంగా కాకాణి పూజితమ్మ మీడియాతో మాట్లాడుతూ……… వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి, వాడ వాడల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, వారి నిరసనను తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు. అరకొరగా పథకాలు అందిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారు అని అన్నారు.కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలు ఎక్కడా క్షీణించకుండా సుపరిపాలనను అందించారు అని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమమే వెన్నుపోటు దినం అని అన్నారు.ప్రభుత్వం, అధికారులు ప్రజల సంక్షేమం కోసం పనిచెయ్యాలి అని అన్నారు.అధికారులు పరిధి దాటి ప్రజలపై నియంతలా ప్రవర్తిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై ఒక నియంతలా వ్యవహరిస్తుంది అని అన్నారు.శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు అని అన్నారు. నాయకులు, ప్రజల సమస్యల గురించి మాట్లాడకూడదు అనే విధంగా వీరి వ్యవహారం ఉంది అని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు అంతే ఉత్సాహంతో, నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు అని అన్నారు. ప్రజల కోసం పోరాడే వారికి ప్రజలు అండగా నిలుస్తారన్నమాట నిన్న వేలాది మందితో జరిగిన నిరసన కార్యక్రమం ఒక ఉదాహరణ అని అన్నారు. అధికారులు మీడియాను కూడా అడ్డుకున్న పరిస్థితిని చూశాం అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పత్రికలకు కూడా స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితులు లేవా! అని అన్నారు ప్రజలను, ప్రజల కోసం పోరాడే నాయకులను ఆపేందుకు ప్రయత్నించారు చివరకు, మీడియా గొంతును కూడా నొక్కాలని చూశారు అని అన్నారు.అధికారులు ప్రజల కోసం పనిచేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రథమం అని ణ అన్నారు. తమ నిరసనను తెలియజేయడానికి వచ్చిన ప్రజలపై, అధికారులు విరుచుకుపడటం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుంది అని అన్నారు. ఇటువంటి చర్యలకు దేవుడు రేపటి రోజున ప్రతిదానికి సమాధానం ఇస్తాడు అని అన్నారు. నాన్న ని జైల్లో పెట్టినా, కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేసినా, కేసులు పెడతామని భయపెట్టినా, వాటన్నింటిని దాటి నిరసన కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయడం సంతోషాన్ని కలిగించింది అని అన్నారు.అరెస్టులతో కేసులతో నాన్నపై సర్వేపల్లి ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు అని అన్నారు మమ నిరసన కార్యక్రమంలో అధికారులు మమ్మల్ని అడుగడుగున అడ్డుకున్నా, మాకు రక్షణగా సర్వేపల్లి ప్రజలు నిలబడ్డారు అని అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాకు నాయకుడు మాత్రమే కాదు మార్గదర్శి కూడా.. అని అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కార్యక్రమం చేపట్టలేదని అవహేళనతో అడ్డంకులు సృష్టించినా వారందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం చెంపపెట్టు.. అని అన్నారు. మేము కార్యక్రమం చేయగలమనే నమ్మకంతో కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు మిథున్ రెడ్డి కి, గురుమూర్తి కి ధన్యవాదాలు తెలిపారు.మా కుటుంబానికి మెండుగా సర్వేపల్లి ప్రజల అభిమానం, ప్రేమ ఉందని గమనించాలి అని అన్నారు. ప్రజలు చేసిన ఈ నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి కనువిప్పు కావాలి అని అన్నారు.ప్రభుత్వ పెద్దలు ఇకనైనా ఇటువంటి చర్యలకు స్వస్తి పలికి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కోరుతున్నాం అని అన్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, లెక్కచేయకుండా, మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటాం.మ అని అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సర్వేపల్లి ప్రజలకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..