

మన న్యూస్ఇ బ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ 5వ వార్డులో శనివారం కచ్చిర్ నుండి లట్టుపల్లి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 10 లక్షల రూపాయల సిసి రోడ్డు, 10 లక్షల రూపాయల అండర్ డ్రైనేజీ పనులను ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని దశలవారీగా ఆదిభట్ల మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తాన్నమని చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కామండ్ల యాదగిరి, స్థానిక కౌన్సిలర్ వనం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి , స్థానిక నాయకులు గుబ్బ రాజు,శిగ మహేందర్,శ్రీనాథ్, కాకి మహేందర్,జంగమ్మ, నాగమ్మ,శిగ జంగమ్మ, శ్రీకాంత్,అర్జున్, రమేష్ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.