

మన న్యూస్ ,నెల్లూరు:*నిరాదరణకు గురైన వారే తన బంధువులు.*కనీస అవసరాలు లేని వారే తన ఆత్మీయులు అనే విధంగా. *ప్రజాక్షేత్రంలో తాను చూసిన కష్టాలను తీరుస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ .*కష్టం వస్తే పవనన్నకు చెప్తాం అని ప్రజలనుకునే అంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు స్పూర్తి ని సగర్వంగా ముందుకు నడిపిస్తాం.*మనుషులంతా ఒక్కటే అనే భావించే మహాత్ములు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అదే పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు.*కోవూర్ సే పాగల్ ఫ్రస్ట్రేటెడ్ ప్రస్సూ భాయ్ వాపస్ ఆయా.సుపరిపాలన మొదలై ఏడాది… అయిన సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం లో నాయకులు,వీర మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు, కార్యాలయాన్ని సాయంత్రం దీపాలతో అలంకరించి టపాకాయలతో దీపావళిని తలపించే విధంగా వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన నాతో గును కుల కిషోర్ మాట్లాడుతూ….గడిచిన ఏడాది కాలంలో జనసేన పార్టీ స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ జనసేన నాయకులు ప్రజలకు చేసిన వాటి పై ఒక గ్రంథమే సరిపోదు అని అన్నారు.అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కులం లేదు, మతం లేదు బడుగు బలహీన వర్గాలకు అందని కనీస సౌకర్యాలు అందజేస్తూ ఒక మహా యజ్ఞమే చేస్తున్నారు అని అన్నారు.తీసుకున్నది పల్లెల అభివృద్ధి పంచాయతీ లలో అవసరతను గమనించి అత్యధిక గ్రామసభలను ఒకే రోజు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించడమే కాకుండా గ్రామానికి ఏ అవసరం ఉందో తెలుసుకోవడానికి గ్రామస్తులే చర్చకు రావాలని తెలిపారు.స్వాతంత్య్రం తర్వాత 75 సంవత్సరాల కి కూడా ఇంకా అభివృద్ధికి నోచుకోని తండా ప్రాంతాల్లో రోడ్లు వేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు,అధికారంలో లేనప్పుడు గమనించిన మంచినీటి సౌకర్యం అయితే విద్యా సౌకర్యాలు విద్యలైతే ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేస్తూ క్షణం తీర్పు లేకుండా ప్రజా సంక్షేమ ప్రక్షాళన చేస్తున్నాడు అని అన్నారు.అదేవిధంగా చంద్రబాబు నాయుడు అయితే నరేంద్ర మోడీ అయితే ఒక మంచి ఒడంబడిక తో ప్రజలకు ప్రజల సంక్షేమము అభివృద్ధి సమతుల్యం చేస్తూ ఈ సంవత్సర కాలంలో విశేష ఆదరణ పొందారు.ఈ కార్యక్రమాన్ని వైభవంగా ఒక వేడుకలుగా చేసుకోవాలి నరకాసుర వధ జరిగినప్పుడు ప్రజలంతా ఎంత సంతోషంగా దీపావళి పండుగ జరుపుకున్నారో అలానే… కష్టనష్టాలతో నలిగిపోతున్న ప్రజానీకానికి ఒక్కసారిగా వైసిపి ప్రభుత్వం నాయకులు నుంచి ఊరట లభించిన రోజు కావున ఈ రోజు సంక్రాంతి దీపావళి తలపించే కార్యక్రమాలను చేయాలని ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచన మేరకు అంగరంగ వైభవంగా పీడ వదిలి ఏడాది సుపరిపాలనకు ఏడాది అనే కార్యక్రమాన్ని చాలా చక్కగా జనసేన నాయకులందరూ కూడా చేయడం జరిగింది అని అన్నారు.క్రిమినల్ సామ్రాజ్యాన్ని కులదోసి ఈరోజుకి సంవత్సరం ప్రజలందరూ కూడా ఒక మంచి సంక్షేమ అభివృద్ధి సమతుల్యంతో ముందుకు సాగుతున్నారు అని అన్నారు.వైసిపి నాయకులు చూస్తే ఏమి చేస్తున్నారో ఏమి మాట్లాడుతున్నారో వారికి తెలియని పరిస్థితి.ఈ రోజున ఆంబోతు సారి అంబటి పోలీసు అధికారులతో వ్యవహరించిన తీరు చూస్తుంటే ఎంత బరితెగించారు అని అన్నారు.ఈ ఐదు సంవత్సరాల కాలం ఎంత బరితెగింపుని కొంతమందిలో పెంచారు అనిపిస్తుంది అని అన్నారు.కోవూరు నియోజకవర్గంలో తానేమి చేయకపోయినా ప్రగల్బాలు పలకడానికి ప్రసన్న మల్లీ వచ్చారు అని అన్నారు.ఒక నాయకుడిగా ప్రజలు ముందుకు వచ్చేటప్పుడు ఏమి మాట్లాడాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రస్సూ భాయ్ అని అన్నారు.కోవూరు పిచ్చి ప్రసన్న ఇంకా నియోజకవర్గం వదల్లా… ఎజ్ అయిపోయింది మీ ఆలోచన లేని పరిపాలనకు ప్రజల బలయ్యారు,ఇక చాలు అని ప్రజల తీర్పును తెలుసుకోండి అని అన్నారు.మీ నాన్నగారు శ్రీనివాసులు రెడ్డి కి మంచి పేరుంది అదంతా మీరు కాల రాశారని ప్రజలందరికీ తెలుసు అని అన్నారు.పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మినిమం అర్హత మీకు లేదని తెలుసుకోండి అని అన్నారు.శ్రీకాకుళం లాంటి అభివృద్ధికి నోచుకోని స్థలాలకు వెళ్లి నాకు కుల మతాలు లేవు, అవసరాలు అందని పేదలే నా బంధువులు అంటూ క్షణం తీరిక లేకుండా ప్రజాక్షేత్రంలో పదవి పొందిన సమయం నుంచి మరింత భారాన్ని మోస్తూ ముందుకు పోతున్నారు,మీరు సొల్లు మాట్లాడుతున్నారు అని అన్నారు.మీ కులానికి ఏమి చేసింది లేదని నోటికి వచ్చినట్లు మాట్లాడారు.కూటమి ప్రభుత్వానికి అద్భుతమైన మద్దతు ఉంది.అశేష ప్రజానీకం మద్దతు చూరగొన్న కూటమి నాయకులు మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకి చేస్తూ చేరువవ్వాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి,కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ నూనె మల్లికార్జున్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రవికుమార్,జిల్లా కార్యాలయం ఇంచార్జ్ జమీర్,ఈగి సురేష్,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,బెల్లపు సుధా మాధవ్,శ్రీరామ్,బత్తల శ్రీకాంత్,నక్కల శివకృష్ణ,జనసేన వీర మహిళలు గునుకుల విజయలక్ష్మి, శాంభవి,ప్రవల్లిక,కవిత, సునీత,కృష్ణవేణి,కస్తూరి,గజరాజు శాంతి కల, నందిని,జనసేన నాయకులు మహేశ్ శర్మ, పవన్ యాదవ్,వెంకట యాదవ్, ఋషి యాదవ్,ప్రసాద్ యాదవ్,గుర్రం కిషోర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



