

- కత్తిపూడి లో పోస్టర్ ఆవిష్కరించిన వైకాపా శ్రేణులు…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరుపుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ దినాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పలు ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ కోఆర్డి నేటర్ గిరిబాబు ఆదేశాల మేరకు మండల కన్వీనర్ నరాల శ్రీనివాస్ నేతృత్వం లో కత్తిపూడి గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా నరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, “జూన్ 4వ తేదీని వెన్ను పోటు దినంగా గుర్తించి ప్రజలకు తెలుగుదేశం పార్టీ మోసాలను, వెన్నుపోటు రాజకీయాలను గుర్తు చేసే విధంగా ప్రతి ఊరిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ప్రజలకు నిజాలు తెలియజేయ డం మాకు బాధ్యతగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అదే తరహాలో మండలం లోని ఇతర గ్రామాల్లో కూడా ఇదే ఉత్సాహంతో వెన్నుపోటు దినాన్ని నిర్వ హించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సోమేశ్, వైకాపా సీనియర్ నాయకులు, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, నియోజకవర్గ యువ జన విభాగం అధ్యక్షుడు సకురు గుర్రాజు, పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు సరమర్ల మధుబాబు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గణేసుల బాబి, రవి, నరాల తాతాజీ, నాయకులు బలువు హరిబాబు తది తరులు పాల్గొన్నారు.