

Mana News ;-ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) :- సమాజంలో పెరిగిపోతున్న మనుష్యులమధ్య అంతరాలను తగ్గించేందుకు వనభోజనాలు దోహదం చేస్తాయని ప్రకృతి పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వనభోజనాలలో సభ్యులందరూ కుటుంబాలతో సహా హాజరై పలు క్రీడ పోటీల్లో పాల్గొన్నారు.ఉదయం నుండి ఆటపాటలతో ఆనంద ఉత్సాహాలతో గడిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావు,ప్రకృతి పరిరక్షణ సంఘం నాయకులు గోళ్ళ నాగేశ్వరరావు,జ్యోతుల నాగ సత్య శ్రీనివాస్,కరోతు సత్యనారాయణ,తాళ్లూరి గొల్లాజీ,వేల్పుల సూరిబాబు,రౌతు సహదేవుడు,చందువోలు రాజా,నారాయణరావు,సిరిపురపు రాజేష్, పెచ్చేటి కృష్ణ,కోట శ్రీనివాస చక్రవర్తి, నర్ల చిదంబరం,చల్లంచర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.