అభివృద్ధి, సంక్షేమము చంద్రబాబుకే సాధ్యం….. వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్, కొడవలూరు:- కొడవలూరు మండలంలో వైసిపి భూస్థాపితం. – వేమిరెడ్డి దంపతుల సమక్షంలో 1500 మంది టిడిపిలో చేరిక. – వైసిపిలో మంచోళ్ళకు స్థానం లేదు. – చంద్రబాబు ప్రతి హామి అమలు చేస్తారు. – పాత, కొత్త నాయకులు పరస్పర సమన్వయంతో పార్టీ బలోపేతం చేయండి. – వేమిరెడ్డి దంపతులు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదల గడప దాకా చేర్చే బాధ్యత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలదేనన్నారు వేమిరెడ్డి దంపతులు. బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో సోమవారం1500 కు పైగా వైసిపి నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాళెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. వైసిపి నాయకులు బెల్లం వెంకయ్య నాయుడు, గరిక మస్తానయ్య,ధర్మారెడ్డి పాళెం ఎంపీటీసీ ఉరుటూరు శేషమ్మ, కమ్మపాళెం సర్పంచ్ చౌటూరు లక్ష్మయ్య, రెడ్డిపాళెం కు చెందిన వైసిపి నాయకులు నీలకంఠం శ్రీధర్ రెడ్డి, కమ్మపాళెం ఎంపీటీసీ పీరం అరుణకుమారి, రామన్నపాలెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు తదితర నాయకులకు వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచోళ్ళు వైసిపిలో వుండలేరన్నారు. దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఆయన అభివృద్ధికి మారు పేరుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని అభివృద్ధి చేయగల సమర్ధత చంద్రబాబు నాయుడు కే వుందన్నారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనకు ఆకర్షితులై రాష్ట వ్యాప్తంగా ప్రజలు టిడిపి వైపు చూస్తున్నారన్నారు. పాత కొత్త నాయకుల మధ్య సమస్యలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసిపి వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు తెలియచేసారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య నాయకులు వారధిగా వుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తన పట్ల నమ్మకం వుంచి తన వెంట రాజకీయ ప్రయాణం చేస్తున్న నాయకులకు అండగా వుంటానన్నారు. గతంలో కోవూరులో కేవలం నలుగురు మాత్రమే అధికారం చెలాయించారని తన హయాంలో ప్రతి గ్రామ నాయకుడు నేరుగా అధికారుల వద్దకు వెళ్లి పనులు చేయించుకునే స్వేక్ష ఉందన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలతో మమేకమై పని చేసే నాయకులకు తాను అండగా వుంటానన్నారు. తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత కోవూరు నినాదంలో నాయకులు భాగస్వాములు కావాలని కోరారు. సహజ వనరులు, ఇఫ్కో, మిధాని లాంటి పారిశ్రామిక సంస్థలున్న కొడవలూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వైసిపి నుంచి టిడిపిలోకి చేరిన బెల్లం కొండయ్య మాట్లాడుతూ… తాను ఎన్నికలలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి సహకరించక తప్పు చేశానని తనను క్షమించాలని కోరారు. తన జీవితాంతం ప్రజలకు నిస్వార్ధ సేవ చేస్తున్న వేమిరెడ్డి అడుగు జాడల్లో నడుస్తానన్నారు. టిడిపిలో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ…. చంద్రబాబు నాయుడు అభివృద్ధి విధానాలు, వేమిరెడ్డి దంపతుల నిస్వార్ధ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై టిడిపిలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, బుచ్చిరెడ్డి పాళెం టిడిపి అర్బన్,రూరల్ టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, బెజవాడ జగదీష్, విడవలూరు టిడిపి మండల అధ్యక్షులు శ్రీహరి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జొన్నవాడ ఆలయ మాజీ ఛైర్మెన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు