

మన న్యూస్ చిత్తూరు జూన్-2
అరకు కాఫీ బార్ ను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు.
చిత్తూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ బార్ వద్దకు చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి”* యాదమరి మండల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాదమరి మండలం, బండివాళ్ళవూరు గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు కృష్ణమూర్తి నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ బార్ ను ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. అనంతరం అరకు కాఫీ బార్ యజమాని కృష్ణమూర్తి కి శుభాకాంక్షలు తెలియజేసారు. అరకు కాఫీ బార్ మంచి సఫలత సాధించాలని ఆయన ఆకాంక్షించారు. సరదాగా కాఫీ బార్ లో కాఫీ తయారు చేసి వినియోదారులకు అందించిన ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకులతో కలిసి కాఫీ రుచిన ఆస్వాదిస్తూ సరదాగా గడిపారు.
