కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ….. మేరిగా మురళి ధర్

తిరుపతి జిల్లా ,గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గృహంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ ఎంపీ మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు. బూటకపు హామీలతో ప్రజల్ని మోసం చేశారని , పెన్షన్లు కూడా ఇప్పటికీ ఒక్కటి కూడా పెంచలేదని అన్నారు.తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా ఇవేవీ చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. గతంలో మేము అభివృద్ధిని, సంక్షేమానికి రెండిటికి ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేశామని కానీ అవి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు . వైఎస్ఆర్సిపి నాయకులు పై అక్రమ అరెస్టులు అక్రమ కేసులు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని అన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులలో ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారో వాళ్లపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని తెలిపారు. మా నాయకులు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖు వెన్నుపోటు అనే కార్యక్రమం ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్ఆర్సిపి నాయకులు హాజరవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంటరీ సమన్వయకర్త మేడ రఘునాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి