

మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-1
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఆదివారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇద్దరూ మైనర్ బాలురు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడడం జరిగిందని, వారి వెహికల్స్ ను సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక మీదట మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పిల్లలను మందలించి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇకపై మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రులపై కేసులు బనాయిస్తామని కౌన్సిలింగ్లో వారి తల్లిదండ్రులను పిలిపించి సీఐ కత్తి శ్రీనివాసులు చెప్పడం జరిగింది. కార్యక్రమంలో సిఐ కత్తి శ్రీనివాసులు తో పాటు మొబైల్ ఏఎస్ఐ గౌరీ శంకర్, కానిస్టేబుల్స్ కిరణ్, నటరాజ్ పాల్గొన్నారు