

Mana News;- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేష్, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, గురువారం మర్యాదపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గ నాయకులు కలవాలని ఉండాలని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో సానుకూలంగా స్పందించడం జరిగిందని రాజేష్ తెలియజేశారు. అలాగే నియోజకవర్గ లోని కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించడం జరిగిందని వివరించారు. అనంతరం ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ పోలవరం ఎత్తును తగ్గించాలని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్లమెంట్లో నిలదీస్తామన్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై కార్యకర్తలపై ఆక్రమ కేసులపై పార్లమెంట్లో తమ వానిని వినిపిస్తామని ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెల్లడించారు.