

Mana News :- వెదురుకుప్పం:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం వెదురుకుప్పం పంచాయతీలో ప్రారంభించిన మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా కార్యదర్శి మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రతి ఓటర్ ని సభ్యత్వం తీపిచ్చి సభ్యత్వం వల్ల వచ్చే ఉపయోగాలను వివరించాలని బూత్ కన్వీనర్లను కోరారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి చంగల్రారెడ్డి రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, యూనిట్ ఇన్చార్జి బియ్యం రవి, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్,గ్రామ కమిటీ అధ్యక్షుడు చిన్నబ్బ, వెంకటాద్రి నాయుడు, కృష్ణారెడ్డి, హేమశేఖర్ రెడ్డి,ధర్మారెడ్డి, మోహన్ రెడ్డి,రాజగోపాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు