

Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేసి,వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ద్యేయంగా పని చేస్తున్న దవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ చరిత్ర అధ్యాపకులు కొండ్ర రమేష్ బాబు ని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు గొర్ల మాణిక్యం, కామా శేషగిరి,వై.జాన్ బాబు తదితరులు శాలువా కప్పి,పూల బొకే తో ఘనంగా సత్కరించారు.అనంతరం కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు గొర్ల మాణిక్యం మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులదే ఘననీయమైన పాత్ర అని అటువంటి వృత్తిని చిత్తశుద్ధితో నిర్వహించే రమేష్ బాబు వంటి అధ్యాపకుల్ని ఉపాధ్యాయ వృత్తిలో పని చేసే మనందరం ఆదర్శంగా తీసుకుని పనిచేసేనప్పుడే దేశ భవిష్యత్ బాగుంటుందన్నారు. రమేష్ బాబు భవిష్యత్ లో మరిన్ని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిoచారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వి.ఎస్.శేఖర్ బాబు, వెంకటరమణ,రత్నం,రాజేష్,తదితరులు పాల్గొన్నారు.