

మన న్యూస్, కడప/ సర్వేపల్లి :*టీడీపీ కూటమి ప్రభుత్వంతో ఏపీలో శాంతియుత పాలన.*ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానికి 500 ఎకరాలు చాలంట..నలుగురుండే జగన్ రెడ్డి కుటుంబానికి 42 ఎకరాలు కావాలంట.”రాష్ట్ర నాశనమైపోవాలని కోరుకుంటున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి*నెల్లూరు జైలులో ఉన్న అందగాడిని చూసేందుకు ఎప్పుడొస్తాడో.కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ ఎన్టీఆర్ బ్రాండ్ అని అన్నారు.ఎన్టీఆర్ 302 సినిమాల్లో నటిస్తే అందులో 275 హిట్ అయ్యాయి,94 సినిమాలు 300 రోజులు ఆడగా, 185 సినిమాలు 175 రోజులు ఆడాయి..చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి అని అన్నారు.ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో మనమందరం సభ్యులుగా ఉన్నాము.ఆస్ట్రేలియాలో జూన్ లో ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. ఆ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు దక్కింది అని అన్నారు.గత ఏడాది జూన్ లో సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే రాష్ట్రంలో శాంతి నిర్మాణం మొదలైంది అని అన్నారు.ప్రజలకు వైసీపీ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి లభించింది .సీఎం పదవి కోసం గతంలో మత కల్లోలాలు సృష్టించిన వాళ్లను చూశాం అని అన్నారు.నక్సలిజంను కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టిన చంద్రబాబు నాయుడి ప్రాణాలకు అలిపిరి ఘటనతో ముప్పు వచ్చింది అని అన్నారు.భగవంతుడి దయ, ప్రజల ఆశీస్సులతో ఆయన క్షేమంగా బయటపడ్డారు అని అన్నారు.తెలుగుదేశం అంటేనే శాంతియుత పాలనకు మారుపేరు,వైసీపీ పాలనలో జరిగిన దుర్మార్గాల గురించి చెప్పాలంటే ఎంత సమయం ఇచ్చినా చాలదు అని అన్నారు.అమరావతి రైతులు పాదయాత్రగా తిరుమలకు వెళుతుంటే మా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో టెంట్లు వేస్తే తీయించేశాడు అని అన్నారు.మహిళల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ల వ్యాన్ ని కూడా పోలీసులతో బలవంతంగా పంపించేశాడు అని అన్నారు.అప్పడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ దుర్మార్గాలకు పాల్పడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నాడు అని అన్నారు.కాకాణి, వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులు మొదట్లో కుటుంబాల గురించి మాట్లాడిన రోజే వైసీపీ నుంచి సస్పెండ్ చేసివుంటే జగన్ రెడ్డికి మరో నాలుగైదు సీట్లు అదనంగా వచ్చుండేవి అని అన్నారు.మొన్న వల్లభనేని వంశీని జైలులో చూడటానికి వెళ్లిన జగన్ రెడ్డి ఆయన చాలా అందగాడని చెప్పుకొచ్చాడు అని తెలిపారు.మరో అందగాడు కాకాణికి చూడటానికి కూడా నెల్లూరుకు వస్తాడేమో అని అన్నారు.ఈ రాష్ట్రం బాగుండటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు,ఐదు కోట్ల జనాభా కలిగిన ఏపీ రాజధానికి 500 ఎకరాలకు సరిపోతుందంట అని అన్నారు.తల్లి, చెల్లిని తరిమేసిన జగన్మోహన్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు అని అన్నారు.నలుగురు సభ్యులుండే జగన్ రెడ్డి కుటుంబానికి యల్లహంకలో 29 ఎకరాలు, పులివెందులలో 5 ఎకరాలు, ఇడుపులపాయలో 5 ఎకరాలు, లోటస్ పాండ్ లో ఎకరా, తాడేపల్లిలో 2 ఎకరాలు..మొత్తంగా 42 ఎకరాలు అని అన్నారు.ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానికి మాత్రం 500 ఎకరాలు చాలంట..ఆయన కుటుంబానికి మాత్రం 42 ఎకరాలు కావాలంట అని అన్నారు.రాష్ట్రం పతనం కావాలి..నాశనమైపోవాలి..తాను, తన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలని భావించే వ్యక్తి చేతుల్లో నుంచి రాష్ట్రం బయటపడింది అని అన్నారు.చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శాంతియుత మార్గంలో పయనిస్తోంది అని అన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వస్తుంటే జగన్ రెడ్డి కడుపుమంటతో రగిలిపోతాడు అని అన్నారు.ఉర్సా కంపెనీకి ఎకరా రూ.50 లక్షల చొప్పున ఇస్తే ఇడ్లీ, వడ రేటుకు ఇచ్చారని పచ్చి అబద్ధాలు చెప్పాడు అని అన్నారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని లోకేష్ బాబు సవాల్ విసిరితే పత్తాలేడు అని అన్నారు.8.13 వృద్ధి రేటుతో ఏపీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉంటే ఆ విషయంలోనూ విషం గక్కాడు అని అన్నారు.రాష్ట్రం నాశనమైపోవాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ సాక్షి పత్రికలో ప్రతిబింబిస్తాయి అని అన్నారు.ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎంగా పనిచేయడం దురదృష్టకరం అని అన్నారు.2012లో రూ.43 వేల కోట్లు అవినీతికి పాల్పడి సీబీఐ కేసులో ఏ1గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.అసెంబ్లీ ఎగ్గొట్టి తాడేపల్లిలో ముసుగేసుకుని కూర్చున్న వ్యక్తి జగన్ రెడ్డి అని అన్నారు.జైళ్లకు పోయి మగోళ్ల అందాలను చూసొచ్చి మీడియా ముందు మురిసిపోతూ వర్ణించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.చిన్నాన్నను చంపిందెవరన్నా..అమరావతి రాజధానిని నాశనం చేసిందెవరన్నా, పోలవరం ప్రాజెక్టుని పడుకోబెట్టిందెవరన్నా, తల్లిని చెల్లిని తరిమేసిందెవరన్నా, మీ బిడ్డ మీ బిడ్డ అంటూ జనం బుడ్డ ముంచిన వ్యక్తి ఎవరంటే ప్రజలందరూ చెప్పే ఒక్కటే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.అలాంటి దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రం బయటపడి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడి చేతుల్లోకి వచ్చింది అని అన్నారు.మన అందరికీ నారా లోకేష్ బాబు అండ ఉంది. ఇక ఈ రాష్ట్ర ప్రగతిని ఎవరూ ఆపలేరు అని తెలిపారు.
