

మన న్యూస్,తిరుపతి, మే 28:- స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతి వేడుకలు తిరుపతిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం గజపులమాలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు, డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబరు ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు, పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.