

శ్రీకాళహస్తి, Mana News :- తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత ప్రయాణం ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై, ఒక మహాశక్తిగా మారి, సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ప్రజా నాయకుడిగా పేద ప్రజల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన యన్టీఆర్ బడుగుల ఆత్మబంధువు అని తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ గుర్తు చేశారు.
సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకొని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని, ఆయన ప్రతి అడుగు నేటి తరానికి మార్గదర్శి అని కొనియాడారు.
తెలుగు ప్రజల స్ఫూర్తి శిఖరం శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఈరోజు స్థానిక బేరివారి మండపం కూడలిలో ఆయన చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాలకే పరిమితం కాకుండా, తనకున్న బహుముఖ ప్రజ్ఞతో తెలుగు వారి సంస్కృతి, వారసత్వం, విలువలు, నీతి-నిజాయితి, భారతీయ తాత్వికత పట్ల అభిమానాన్ని ఆచరణలో చూపించిన ఎన్టీఆర్ వ్యక్తిత్వం విలక్షణమైనది అని వక్తలు కొనియాడారు.
ముక్కుసూటితనం, అంకితభావం, క్రమశిక్షణ, ఆదర్శప్రాయమైన జాతీయవాదం, లక్ష్యం పట్ల నిబద్ధత, దృఢమైన ఆత్మవిశ్వాసం సమ్మిళితమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వం చిరస్మరణీయమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైన వారి వ్యక్తిత్వ ప్రేరణతో యువతరం వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యుడు యం.సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ నాయుడు, పొన్నారావు, గాలి మురళి నాయుడు, లక్కమనేని మధుబాబు, డా.యం.ఉమేష్ రావు, మునిరాజా యాదవ్, షేక్ ఖాదర్ భాషా, డి.వి.నారాయణ, వజ్రం కిషోర్, దుర్గాప్రసాద్, వెంకటరమణ, షేక్ మహబూబ్ భాషా, కోట చంద్రశేఖర్, భాస్కర్, బాలాజీ, వినయ్, మురళీకృష్ణ, రాజు, భాస్కర్, మణి, మురళి రెడ్డి, కృష్ణమూర్తి, ప్రభాకర్, కిరణ్, వినోద్, వంశీ, వెంకటస్వామి, సుల్తాన్, చాంద్ భాషా, బాలు, భార్గవ్, రవి, నాగరాజు, రమణ, జయచంద్ర, ముని కుమార్, వేణు, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.