

శ్రీకాళహస్తి, Mana News – తెలుగు జాతిలో నిద్రాణమైన శక్తిని పునరుత్తేజం చేయడానికి నాడు అన్న యన్టీఆర్ చూపిన మహోన్నతమైన బాటను, మాటను తుచ తప్పకుండా పాటించడానికి ‘ఛలో కడప – జై భోలో మహానాడు’ అని నినదిస్తూ వైయస్సార్ కడప జిల్లా కేంద్రానికి రావాలని పిలుపునిచ్చారు.
ఈరోజు నుండి వరుసగా మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నాయకత్వంలో కడపకు బయల్దేరిన నాయకుల వాహన శ్రేణిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గాలి చలపతి నాయుడు మరియు డా.జి.దశరధాచారి లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జరుపుకునే పెద్ద పండుగ మహానాడును విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, శ్రీకాళహస్తి నుండి వేలాదిగా తరలి వెళ్ళడం శుభపరిణామం అని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా.జి.దశరధాచారి, గాలి చలపతి నాయుడు, మిన్నల్ రవి, ప్రకాష్ నాయుడు, గాలి మురళి నాయుడు, డా.యం.ఉమేష్ రావు, వజ్రం కిషోర్, పేట బాలాజీ రెడ్డి, మునిరాజా యాదవ్, కోట చంద్రశేఖర్, దేవీ మోహన్, భాస్కర్, యం.యస్. రెడ్డి, మణికంఠ, భాస్కర్ నాయుడు, మురళి, కొల్లంగుంట మణి, ప్రభాకర్, కృష్ణమూర్తి, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.