

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న 8 ట్రాక్టర్లు,1 జెసిబి ని నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ పట్టుకున్నారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన ప్రకార౦ వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలాంటి అనుమతి లేకుండా మొరం తవ్వుతున్న జెసిబిని,మొరం లోడుతో ఉన్న 2 ట్రాక్టర్లను, 6 ఖాళీ ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా అక్రమమొరం, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.