

మన న్యూస్, నెల్లూరు ,మే 25:ఒకరు మృతి – ఇంకొకరి పరిస్థితి విషమం – మరో నలుగురి కి తీవ్ర గాయాలు. ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం గండవరం నేషనల్ హైవే వద్ద బస్సును లారీ డీకొట్టడం తో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైస్సార్సీపీ నాయకులు ఫిరంగి బాబు రావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న సందర్బంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.బాబు రావు కు పోస్ట్ మార్టమ్ పూర్తి చేయించడం తో పాటు, కిరణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వైద్యులను అడిగి తెలుసుకుని.. హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి.. కిరణ్ కుమార్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.అనంతరం కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను చంద్రశేఖర్ రెడ్డి కలుసుకొని.. ధైర్యం చెప్పారు. కిరణ్ కుమార్ కు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని.. అధైర్యపడవద్దని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి వెంట వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు అశోక్, లోకేష్, వెంకట్, ఖాదర్, చంద్ర, ప్రసన్న,మీరా పెంచలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

