

Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి చైర్మన్ తెలంగాణ సీఎంకు పట్టువస్త్రం అందజేశారు. అనంతరం టీటీడీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలిసిన బీఆర్ నాయుడును సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు