

మన న్యూస్ ,నెల్లూరు ,మే 24:సామాన్యుడి సమస్యల పరిష్కారాల వేదికగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని రూపొందించి ఎవరి సమస్యలకైనా పరిష్కార మార్గాలని చూపిన ఈ మహత్తర కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా గోమతి నగర్ లో ప్రతి బుధ, శనివారాల్లో ఏపీ టిడ్కో చైర్మన్, జనసేన జాతీయ మీడియా ప్రతినిధి, క్రమశిక్షణా విభాగం హెడ్ వేములపాటి అజయ్ సూచనల తో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో నిరంతరయంగా సాగుతూ ఎంతోమంది పేదల సమస్యల పరిష్కారానికి మార్గాలను చూపుతూ సాగుతుంది.ఈ కార్యక్రమం ఈరోజు కూడా పలువురు వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అర్జీలు రూపంలో సమర్పించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జిల్లా కార్యాలయ ఇన్చార్జి జమీర్,సీనియర్ నాయకులు ఏటూరి రవికుమార్,పవన్ యాదవ్,కస్తూరి,తదితరులు పాల్గొని సంబంధిత అధికారులతో సంభాషించి ప్రజల సమస్యల పరిష్కార మార్గాలను చూపించారు.
