

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ప్రత్యేకాధికారి ప్రశాంత్ రెడ్డి నర్వ, తుంకిపల్లి, గాలిపూర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు వేగవంతంచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వరి ధాన్యంను తూకం చేసిన వెంటనే లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేసి మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కూలీలు ధాన్యాన్ని బస్తాలు నింపగానే లారీల్లో తరలించే విధంగా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ మానిటరింగ్ అధికారి కరుణాకర్ రెడ్డి,తహసీల్దార్ సవాయిసింగ్,సొసైటీ సీఈవో చింతలరాములు,సిబ్బంది భాస్కర్,కొనుగోలు కేంద్రనిర్వహకుడు రాజేందర్, రాజు తదితరులు ఉన్నారు.