

హైదరాబాద్, మన న్యూస్ :- తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ డా. రామకృష్ణ గౌడ్ గారు –
“మంత్రిగారిని కలవడం ఆనందదాయకం. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు, తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి గారికి వివరించాం. త్వరలో మరిన్ని అంశాలపై సమగ్ర చర్చలు జరిపే ఉద్దేశ్యంతో హామీ ఇచ్చారు. ఈ స్పందనకు మంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని పేర్కొన్నారు.పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం నిరంతరంగా కొనసాగాలని డా. గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.