

మన న్యూస్,తిరుపతి, మే 23 :– ఆంధ్రప్రదేశ్ సీడప్ (నిరుద్యోగ గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల)చైర్మన్,మాజీ ఎమ్మెల్సీ,తెలుగుదేశం పార్టీ తిరుపతి అన్నమయ్య జిల్లాల ఇన్చార్జ్ శ్రీ గునిపాటి దీపక్ రెడ్డి శుక్రవారం తిరుపతిలోని బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి స్వగృహానికి విచ్చేసి నవీన్ మాతృమూర్తి శారదమ్మ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి తన సంతాపాన్ని తెలియజేస్తూ ఘన నివాళులర్పించారు. వ్యక్తిగత కారణాలవల్ల శారదమ్మ శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి నవీన్ కుమార్, కుటుంబ సభ్యులకు తెలిపారు. బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి, టిడిపి నేత నవీన్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు,డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి నేతలు కోడూరు బాలసుబ్రమణ్యం,మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, ఆనంద్ బాబుయాదవ్,ఆర్.ముని రామయ్య నాయకులు బుల్లెట్ రమణ,కృష్ణ యాదవ్ మధు ఆనంద్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.