

శంఖవరం మన న్యూస్ (అపురూప్) పంటలకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పిఎండిఎస్ సాగు తోనే పెరుగుతుందని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. వి.వెంకటాపురం,శంఖవరం గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పి. ఎం. డి.ఎస్) పద్ధతిలో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించి సూచనలు ఇచ్చారు.ఈ పద్ధతిలో పొలంలో సుమారు 20- 30 రకాల పంటల విత్తనాలు వెదజల్లడం జరుగుతుందని,ఈ సాగును నవధాన్యాల సాగుగా పరిగణించ వచ్చని,ప్రధాన పంటకు కావాల్సిన సూక్ష్మజీవులు, సూక్మ పోషకాలను అందుబాటులోకి తీసుకు వచ్చి నేల గుల్లబారుతుందని, నేలకోతకు గురి కాదని,నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది అని వివరించారు.ప్రధాన పంటలో చీడపీడలను తట్టుకునే సామర్ధ్యo పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ ఈ ఓ శ్రీనివాస్,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సోమరాజు, లోలక్ష్మీ, బాబురావు,సుబ్బారావు,రమణ,నాగలక్మి, వెంకటలక్ష్మి,రజనీ,రైతులు పాల్గొన్నారు .